అబౌట్ అజ్

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ ట్రూ సిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఓపెన్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో పెట్టుబడికి గల సువర్ణావకాశాలను మేము మీకు అందిస్తున్నాం.

ట్రూ సిటీ ప్రాజెక్ట్స్ సంస్థను ప్రారంభించిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన కంపెనీగా మేము పేరు నిలబెట్టుకున్నాం. కస్టమర్ల భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు(ఫామ్ ల్యాండ్స్) ను తీర్చిదిదిద్దుతున్నాం. అనుభవం కలిగిన నిపుణుల సాయంతో వినియోగదారుల కలలను నిజం చేయడం మాకెంతో గర్వ కారణం. ఈ విషయంలో మాకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము.

మా దృష్టి

2030 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నత స్థానానికి చేరాలన్నదే మా లక్ష్యం. నాణ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామన్న మా విశ్వసనీయతను నిరంతరం మెరుగు పరుచుకోవడంపైనే మేము దృష్టి పెడతాం.

కస్టమర్లు, భూ యజమానులు, ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలతో సంబంధాలు మెరుగు పరుచుకోవడం ద్వారా భవిష్యత్తు అభివృద్ధిపై దృష్టి పెట్టడమే మా లక్ష్యం.

మిషన్ స్టేట్మెంట్

కొత్తగా ఇండ్లు నిర్మించుకునే వారికి అవసరమైన భూమిని సమకూర్చడానికి ప్లాటెడ్ ల్యాండ్ డెవలపర్ గా మేము ఎంతో క్రమశిక్షణతో , అంకిత భావంతో పని చేస్తాం. మాకు కేటాయించిన ప్రాజెక్టులన్నింటినీ మాకున్న అపారమైన వనరులతో నిర్మిస్తాం. మా ప్రతి ప్రాజెక్టును అత్యుత్తమ నాణ్యతతో నిర్దేశించిన సమయంలోగా అనుకున్న బడ్జెట్లో పూర్తి చేస్తాం. అత్యుత్తమ అంతర్గత పని విధానం మా బలం. దీని ద్వారానే గతంలో మేము మా కస్టమర్లకు విలువైన సేవలందించాము. భవిష్యత్తులోనూ ఇదే విధంగా సేవలందిస్తాం. మేము మా కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ను గౌరవిస్తాం.మాది రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘ ప్రయాణం. మాకున్న అత్యుత్తమ నైపుణ్యాలు, అనుభవం, వనరుల బలం, ఆర్థిక బలాన్ని గమనించి కస్టమర్లు నిశ్చింతంగా ఉండొచ్చు. చిన్న చిన్న ఓపెన్ ప్లాట్ల అభివృద్ధి మొదలుకొని పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాన్ని మేము అనుకున్న సమయంలోగా పూర్తి చేయగలం.

విలువలు & సంస్కృతి

సమగ్రత: అర్థం చేసుకోవ‌డం, దృఢంగా, నిష్ప‌క్ష‌పాతంగా ఉండ‌టం, నిజాయితీ, పారదర్శకంగా ఉండ‌టం.

టీమ్ వర్క్: ఒకే టీమ్‌గా ప‌ని చేయ‌డాన్ని బ‌లోపేతం చేయ‌డం, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని, మ‌ద్ద‌తును ప్రోత్స‌హించ‌డం.

గౌరవం: ఇతరుల అభిప్రాయాలు, సేవ‌లు, భావాలు, కోరిక‌ల‌కు త‌గిన గౌర‌వం ఇవ్వ‌డం

నిబద్ధత: మా వ్యాపారంలోని అన్ని కోణాల్లో అద్భుత ప్ర‌గ‌తి సాధించ‌డానికి అంకిత భావంతో ఉండ‌టం.

ఇన్నోవేషన్: కంపెనీ విజయానికి దోహదపడే కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం.

మా Team

ప్రోమో వీడియో చూడండి