మహాత్మా ఫౌండేషన్

బాలల భవిత...
చిన్నారికి చేయూత...

పేద చిన్నారులకు చేయుత అందించాలనే సత్సంకల్పం.. వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే సదాశయం, ధృఢ సంకల్పం మన ట్రూ సిటీ యాజమాన్యం కలిగి ఉంది. వీలైనంత మంది పేదింటి చిన్నారులకు నాణ్యమైన విద్య, వైద్యం, పౌష్టిక భోజనం, జీవన నైపుణ్యాలు, దేశభక్తి అందించడమే మా లక్ష్యం.. పిల్లల్ని ఇంట్లో వదిలి పొట్ట కూటి కోసం పనికి వెళ్లే ఎందరో తల్లిదండ్రులు, ఆ పసి పిల్లలకు సరైన పోషకాహారం అందించలేకపోతున్నారు. వారి బాగోగులను పట్టించుకోలేరు. వారిని మంచి మార్గం వైపు తీసుకువెళ్ళలేరు. అందుకే వారి ఆలనా పాలనా చూసుకుంటూ, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బాధ్యత ట్రూ సిటీ తీసుకుంటోంది. బీదరికంలో మగ్గుతూ, దారిద్య రేఖకు దిగువన ఉన్న ఎన్నో కుటుంబాలు తమ బతుకులను భారంగా వెళ్లదీస్తున్నాయి. దినసరి కూలీలుగా ఉన్న చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్య, వైద్యం, పోషకాహారం ఇవ్వులేకపోతున్నారనేది కఠిన వాస్తవం. దీని వలల్ చిన్నతనంలోనే పెళ్ళయి, తల్లి అయిన ఎంతోమంది అభాగ్యులైన ఆడ పిల్లల జీవితాలు చిన్న వయసులోనే చితికిపోతున్నాయి. ఇక బాలురైతే ఎవరి పర్యవేక్షణ లేక, సంస్కారం నేర్పించే వాళ్లు లేక బాల్యంలోనే చెడు వ్యసనాలకు, సావాసాలకు లోనై దారి తప్పుతున్నారు. అనైతికంగా ప్రవర్తిసూ సమాజానికి సవాలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పేద చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపడానికి, వారికి 18 ఏళ్లు వచ్చే వరకు మంచి విద్య, వైద్యం మరియు పోషకాహారం అందించే గురుతర బాధ్యతను ట్రూ సిటీ చేపట్టింది. చిన్నారికి చేయూత అనే అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చి, తమ పరిధిలో గల కొందరు పేద పిల్లల బాగోగుల పట్ల శ్రద్ధ వహిస్తోంది. వారికి విద్య, వైద్యం, పోషకాహరం అందిస్తున్నది. ఈ పిల్లలకు ఆటపాటలు, కళలు, స్వీయ రక్షణ, సామాజిక స్పృహ, నైతిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసం, దేశభక్తి వంటి ముఖ్యమైన విషయాల శిక్షణా బాధ్యతలు ట్రూ సిటీ వాలంటీర్లు చేపడుతున్నారు. ఈ సత్సంకల్పంలో భాగస్వాములు అయ్యేందుకు పలు రంగాలలోని నిపుణులు వాలంటీర్లుగా ముందుకు రావటం ట్రూ సిటీకి గర్వకారణం.

ఈ బృహత్తర బాటలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని/భాగస్వామ్యాన్ని అందించగలరు.